అద్భుత ప్రశంసలు అందుకుంటోన్న 'మధ'మూవీ

అద్భుత ప్రశంసలు అందుకుంటోన్న మధమూవీ
X

మధ.. ఈ శుక్రవారం విడుదలైన సినిమా. అంతా కొత్తవారే చేశారు. అయినా సరే ఈ సినిమాకు అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. శ్రీ విద్య బసవ అనే లేడీ డైరెక్టర్ రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే 26 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైంది. అన్ని చోట్లా ప్రశంసలతో పాటు అవార్డులు సైతం అందుకుంది. అలాంటి సినిమా తెలుగు నుంచే ఉందా అని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ ఇది అచ్చమైన తెలుగు సినిమా. తెలుగువారు రూపొందించిన ప్రతిభావంతమైన సినిమా.

అనాధ అయిన ఓ యువతిని ప్రేమ పేరుతో వంచిస్తాడో యువకుడు. అంతకు ముందు తనకు ఈ ప్రేమంటే పెద్దగా నచ్చదు. కానీ అతని మాయలో పడిపోతుంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తాడా యువకుడు. ఆ తర్వాత ఆమె జీవితం డ్రగ్స్ కు బానిస అవుతుంది. అటుపై తన శరీరంపైనే ఓ మెడికల్ మాఫియా ప్రయోగాలు చేస్తుంటుంది. మరి ఆ అమ్మాయి జీవితం అలా కావడానికి కారణం ఎవరు..? ఈ మెడికల్ మాఫియా చేసిన అరాచకాలేంటీ..? అసలు ప్రేమ పేరుతో ఆ అమ్మాయి లైఫ్ లోకి ఎంటర్ అయింది ఎవరు..? ఈ అన్ని ప్రశ్నలకు అద్భుతమైన ట్విస్ట్ లతో ముడిపెట్టిన సమాధానాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

ఇలాంటి సినిమాలు తెలుగులో ఇంత వరకూ రాలేదనే చెప్పాలి. ప్రతి అంశం డీటెయిలింగ్ గా కనిపిస్తుంది. ప్రతి సీన్ లోనూ దర్శకత్వ ప్రతిభ ఆశ్చర్యపరుస్తుంది. ఓ లేడీ డైరెక్టర్ కు ఈ తరహా సినిమాపై అంత పట్టుండటం నిజంగా విశేషమనే చెప్పాలి. టూ డిఫరెంట్ డైమెన్షన్స్ లో చెప్పిన కథ, కథనం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక సినిమాకు ప్రధాన బలం ఆర్టిస్టులు. ముఖ్యంగా ప్రధాన పాత్రలో నటించిన త్రిష్ణా ముఖర్జీ. ఆమె నటన సినిమాకు హైలెట్. ఎమోషనల్ గా డ్రగ్ ఎడిక్ట్ గా ఎక్స్ పర్మెంటల్ విక్టిమ్ గా ఇలా భిన్న కోణాల్లో తన నటన నెక్ట్స్ లెవెల్లో కనిపిస్తుంది.

ఇక ఈ తరహా సినిమాకు ప్రధాన బలంగా నిలిచే అన్ని టెక్నికల్ ఎలిమెంట్స్ సింప్లీ సూపర్బ్. ఫస్ట్ హాఫ్ లో కొంత పార్ట్ బోర్ అనిపిస్తుంది.. అలాగే ఎంటర్టైన్మెంట్ లేకపోవడం కొంత ఇబ్బందే అయినా.. సరికొత్త సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి.

Next Story

RELATED STORIES