Top

బిగ్ బ్రేకింగ్.. అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా

బిగ్ బ్రేకింగ్.. అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా
X

ప్రపంచలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. దీనివల్ల ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఈ వైరస్‌ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరికి సోకుతోంది. అప్పుడే పుట్టిన పిల్లలను కూడా వదలడం లేదు. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌.. అప్పుడే పుట్టిన శిశువుకు సైతం సోకింది. లండన్‌లో అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. లండన్‌లో ఓ మహిళ నిండు గర్భిణిగా ఉన్న సమయంలో.. ఆమె న్యూమోనియాతో బాధపడింది. అయితే ప్రసవానికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఆమె ముందుగానే నార్త్ మిడిల్‌సెక్స్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆ గర్భిణి శిశువుకు జన్మనిచ్చిన తర్వాత.. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. శిశువుకు కూడా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. దీంతో, ఆ శిశువుకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో తల్లీబిడ్డను వేరు వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే, ఇదే తొలికేసు కావడంతో.. అసలు శిశువుకు కరోనా ఎలా సోకింది అనేదానిపై దృష్టి సారించారు వైద్యులు.

Next Story

RELATED STORIES