ప్రత్యర్థుల్ని భయపెట్టి, కేసులతో వేధించి, టార్గెట్ చేసి గెలవడం కూడా ఒక గెలుపేనా

ప్రత్యర్థుల్ని భయపెట్టి, కేసులతో వేధించి, టార్గెట్ చేసి గెలవడం కూడా ఒక గెలుపేనా

ప్రత్యర్థుల్ని భయపెట్టి, కేసులతో వేధించి, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి గెలవడం కూడా ఒక గెలుపేనా. ప్రస్తుతం ఏపీలో ఇదే జరుగుతోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా.. వైసీపీ నేతలు, వాళ్ల అనుచరులు రెచ్చిపోయారు. ఎక్కడిక్కడ స్థానిక ఎన్నికల్లో పోటీ లేకుండా చూసుకునేందుకు ఎంత చేయాలో అంతా చేశారు. దాదాపు 25 శాతం చోట్ల బెదిరించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో నామినేషన్లు ఉపసంహరింప చేశారు. గడువు ముగిసాక కూడా బలవంతంగా ఉపసంహరణల పర్వం కొనసాగింది. ప్రజాప్రతినిధిగా పోటీ చేసిన వాళ్లు అధికార పార్టీ ఒత్తిళ్లతో కన్నీరు పెడుతూ వచ్చి నామినేషన్లు విత్‌డ్రా చేసుకుంటే.. మరికొన్ని చోట్ల ఫోర్జరీ సంతకాలతో ఆ పని కూడా వైసీపీ వాళ్లే చేసేశారు. ఇంకొన్ని చోట్ల అభ్యర్థుల్ని ఎత్తుకొచ్చి బలవంతంగా వేలిముద్రలు వేయించి పోటీ నుంచి తప్పించారు. ఐనా వెరవని వాళ్లను అక్రమ మద్యం కేసుల్లో ఇరికిస్తున్నారు. కాలు కదిపినా ఏదో పేరు చెప్పి టార్చర్ చేస్తుండడంతో ఈ మెంటల్ టెన్షన్ భరించలేమంటున్నారు పోటీలో ఉన్న విపక్ష అభ్యర్థులు.

రాష్ట్రంలో 25 శాతం నియోజకవర్గాల్లో ఎన్నికలు లేవు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా జగన్ పది నెలల పాలన మెచ్చి పోటీ చేయలేదంటే నమ్ముతారా? గడువు దాటినా బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ చేయిస్తుంటే రిటర్నింగ్ అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నట్టు? కొన్ని చోట్ల అధికారుల ముందే బెదిరింపులు కొనసాగినా చేష్టలుడిగి చూడడం అంటే పరిస్థితి ఎంత ఘోరాతిఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంత దారుణంగా, గూండాగిరీతో జరిగేవి ఎన్నికలంటారా? ఏకగ్రీవమే అజెండాగా పులివెందుల, పుంగనూరులో సాగిన బెదిరింపుల గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కడపలో 50 జెడ్పీటీసీ స్థానాలకు 35 ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలకు ముందే కడప జెడ్పీ పీఠం వైసీపీ వశమైంది. కేసుల భయం, ప్రాణభయంతో అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నారనే నిజం కళ్లముందే కనిపిస్తున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ పరిణామాల్ని సీరియస్‌గా తీసుకోవవడం లేదని, ఇదెక్కడి పద్ధతని విపక్షాలు మండిపడుతున్నాయి. కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్రలోనూ తొలిసారి దారుణ పరిస్థితులు చూస్తున్నామని, పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారానికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితుల్లో జరిగేవి ఎన్నికలని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు.

మాచర్లలో ఇద్దరు టీడీపీ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణే భయానకంగా జరిగిందంటే జనసేన అభ్యర్థితో విత్‌డ్రా చేయించిన తీరు ఇంకా దారుణం. అభ్యర్థిని లాక్కెళ్లి మరీ రిటర్నింగ్ అధికారి ముందు ఉంచి సంతకం చేయించారు. దీన్ని ఆ అధికారులూ అడ్డుకోలేదు, పోలీసులు పట్టించుకోలేదు.

కర్నూలులో వైసీపీ నేతల దౌర్జన్యంతో అభ్యర్థులంతా భయపడుతున్నారు. ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల-1 ఎంపీటీసీ అభ్యర్థి మహాలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తే ఒత్తిళ్లకు గురి చేసి పోటీ నుంచి తప్పుకునేలా చేశారు. పోలీసుల సహకారంతోనే ఇదంతా జరిగినట్టు మహాలక్ష్మి తండ్రి లింగన్న చెప్తున్నారు. నామినేషన్ విత్‌డ్రా తర్వాత ఆయన MPDO కార్యాలయం ముందే గుండెలు బాదుకుంటూ రోధించారు. తనపై అక్రమంగా బైండోవర్ కేసులు పెట్టి స్టేషన్‌కి పిలిచి SIతో మాట్లాడుతుంటే.. ఇటు బెదిరించి తన కుమార్తెతో నామినేషన్ విత్‌డ్రా చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడలో పోలీసులపైనా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. 39వ డివిజన్‌లో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై దాడి జరిగింది. ఐతే అనూహ్యంగా పోలీసులు టీడీపీ అభ్యర్థి శివ వర్మ, గన్నే ప్రసాద్, హరిబాబులపైనే కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సరైనా ఆధారాలు లేవంటూ రిమాండ్‌కు న్యాయమూర్తి తిరస్కరించారు. కోర్టు కాదన్నాక కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రెండ్రోజులుగా స్టేషన్‌లోనే టీడీపీ నేతలను ఉంచారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story