బోండా ఉమా, బుద్దా వెంకన్నపై దాడి చేసిన వ్యక్తి ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక

బోండా ఉమా, బుద్దా వెంకన్నపై దాడి చేసిన వ్యక్తి ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక

రాజకీయానికి అర్థం ఎప్పుడో మారిపోయింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇది మరింత పరాకాష్టకు చేరింది. రౌడీయిజం, దౌర్జన్యం, బెదిరింపులు, దాడులు.. ఇవే అర్హతలుగా మారిపోయాయి. ఎంత ఎక్కువగా రచ్చచేస్తే అంత గొప్ప నజరానాలు లభిస్తున్నాయి. ఇటీవల మాచర్లలో పట్టపగలు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించి.. టీడీపీ నేతలపై దాడి చేసిన తురక కిషోర్‌కు వైసీపీ గొప్ప బహుమతి ప్రకటించింది. కౌన్సిలర్ పదవికి కూడా అర్హత లేని వ్యక్తిని ఏకంగా ఛైర్మన్‌ను చేసింది. మాచర్ల మున్సిపాలిటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు కిషోర్.

మాచర్లలో వైసీపీ అరాచకాలు పీక్‌ స్టేజ్‌కు చేరాయి. ఇక్కడ మొత్తం 31 వార్డుల్లో కేవలం వైసీపీ అభ్యర్థులే నామినేషన్లు వేశారు. అంటే ప్రత్యర్థి పార్టీలకు కనీసం పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేశారు. ఇంకో దారుణం ఏంటంటే కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థుల ముసుగులో వైసీపీ కార్యకర్తలే నామినేషన్లు వేశారు. ఆ తర్వాత ఆ నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవడం ద్వారా ఆ స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా చేశారు. అంటే టీడీపీ వాళ్లకు నామినేషన్లు కూడా వేసే అవకాశం లేకుండా చేశారన్న విమర్శలు రాకుండా ఉండేందుకు ఆడిన కొత్త తరహా డ్రామా ఇది..

ఇక మాచర్ల మున్సిపల్ ఛైర్మన్‌గా తురక కిషోర్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం ద్వారా వైసీపీ ఏం చెప్పదల్చుకుంది.? పదవులు కావాలంటే అందరూ కిషోర్‌లాగా రెచ్చిపోండి... ప్రత్యర్ధులపై దాడులు చేయండని చెబుతోందా? ఎంత ఎక్కువ రౌడీయిజం చేస్తే అంత గొప్ప పదవులు లభిస్తాయని పార్టీ శ్రేణులకు మెసేజ్ ఇస్తోందా? ఏపీలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. వైసీపీ శ్రేణులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యర్ధులపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.. కనీసం నామినేషన్లు వేసే స్వేచ్చ కూడా లేదంటే ఏపీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ఆంక్షలు, అడ్డంకులు దాటుకొని ఎవరైనా నామినేషన్ వేసినా సరే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. పోలీసుల సాయంతో అక్రమ కేసులు పెట్టించి మానసికంగా దెబ్బతీస్తున్నారు.

ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొన్న సమయంలో పట్టపగలే టీడీపీ నేతలపై దాడి చేసి.. కేసులు ఎదుర్కొంటున్న తురక కిషోర్‌కు మున్సిపల్ ఛైర్మన్ పదవిని నజరానాగా ఇవ్వడం ద్వారా వైసీపీ తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పినట్లైంది. అంటే ఇప్పుడు జరిగే, ఇకపై జరగబోయే ఎన్నికల్లో ఎంత దౌర్జన్యం చేస్తే అంత పెద్ద పదవులు వస్తాయని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులకు సందేశం ఇచ్చినట్లు అయిందని విపక్షాలు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story