మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపైనా దాడికి పాల్పడిన దుండగులు

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపైనా దాడికి పాల్పడిన దుండగులు

ఏపీలో వైసీపీ అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో రాష్ట్రం గుండాల రాజ్యంలా మారిపోయింది. టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నపై దాడికి దిగిన వైసీపీ కార్యకర్తలు నిన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపైనా దాడికి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో స్వల్ప కారణాలతో టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లను తిరస్కరించారు. దీనిపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అధికారులతో మాట్లాడుతుండగా పెద్ద ఎత్తున వచ్చిన వైసీపీ నేతలు కాల్వపై దాడికి పాల్పడ్డారు.ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో చొరబడి కాల్వపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక నామినేషన్ల విషయంలో అధికార పార్టీదే ఇష్టారాజ్యంగా మారిపోయింది. ప్రతిపక్షాలకు నామినేషన్లు వేసే అవకాశాన్ని కూడా ఇవ్వటం లేదు. ఎవరైనా నామినేషన్‌ వేసేందుకు వస్తే దాడులకు తెగబడుతున్నారు. దాడులను దాటుకొని కూడా నామినేషన్ వేసిన అభ్యర్ధులను విత్‌ డ్రా చేసుకోవాల్సిందే అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కేవలం తమ పార్టీ అభ్యర్ధులతో మాత్రమే నామినేషన్లు వేయించి ఏకగ్రీవం అంటూ చంకలు గుద్దుకుంటున్నారు. ఏపీలో వైసీపీ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే..రాష్ట్రవ్యాప్తంగా 93 వార్డుల్లో అధికార పార్టీ నామినేషన్లే దాఖలయ్యాయి. ఇక గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులుండగా అన్నిచోట్ల వైసీపీ అభ్యర్థులే నామినేషన్లు వేశారు. ప్రజామ్యం ఖూనీ అయిందనడానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం లేదంటున్నారు విపక్ష పార్టీల అభ్యర్థులు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో 31 వార్డులకు గాను 14 చోట్ల వైసీపీ అభ్యర్థులే నామినేషన్లు వేశారు. మహిళలని కూడా చూడకుండా దుర్మార్గంగాప్రవర్తించారు. కొన్ని చోట్ల నామినేషన్‌ పత్రాలను ఎత్తుకుపోవడం, చింపేయడం వంటి ఘటనలు వెలుగు చూశాయి..తిరుపతి కార్పొరేషన్‌లోని ఐదు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారు. కర్నూలు జిల్లా డోన్‌లో అధికార పార్టీ అరాచకాలతో టీడీపీ ఎన్నికలను హిష్కరించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక్కడ 32 వార్డులుంటే 12 చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తం 13 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని, భయపెట్టి, బెదిరించి అధికార పార్టీ మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కడప జిల్లాలో నామినేషన్ల దాఖలు చివరి రోజు టీడీపీ అభ్యర్థులపై ముప్పేట దాడి జరిగింది. మాజీ మార్కెట్‌ ఛైర్మన్‌, టీడీపీ అధికార ప్రతినిధి గాజుల ఖాదర్‌ భాషాపైనా దాడి జరిగింది. ఖాదర్‌భాషా.. టీడీపీ జిల్లా అధ్యక్షుడితో కలిసి పోలీసులకుఫిర్యాదు చేశారు. అయితే.. తమపై కూడా దాడి జరిగిందంటూ వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు యడం గమనార్హం.

కర్నూల్‌ జిల్లా నంద్యాలలో పోలీసులు బెదిరిస్తున్నారని బీజేపీ MPTC అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. భయపడిపోయిన అభ్యర్థులు బీజేపీ నేత అభిరుచి మధు ఇంట్లో తలదాచుకున్నారు. జిల్లాలో పోలీసుల అరాచకాలను... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.

గుంటూరు, కర్నూలు జిల్లాల్లో టీడీపీ, బీజేపీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులను వెనక్కు తీసుకోవాలని బెదిరింపులకు గురిచేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో నగరం మండలం ధూళిపూడి-1 ఎంపీటీసీ అభ్యర్థిని అరుంబాక మల్లీశ్వరి పోలీసులపై ఘాటు విమర్శలు చేశారు. తమ ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చారని ఆమె చెప్పారు..

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో టీడీపీ అభ్యర్థుల్ని పోటీ నుంచి తప్పించేలా ఒత్తిడి తెస్తున్నారంటూ ఒంగోలు ఆర్డీవోకు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఫిర్యాదు చేశారు. 13 మంది కార్యకర్తలను బైండోవర్‌ పేరుతో తీసుకొచ్చి సీఐ రాజమోహన్‌ గొడ్లను బాదినట్లు బాదారని ఆగ్రహం వ్యక్తం చేశారు..

విశాఖలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును టార్గెట్‌ చేస్తూ అతని వైన్‌ షాపులపై అక్రమ కేసులు పెట్టేందుకు ఎక్సైజ్‌ పోలీసులు విఫలయత్నం చేశారు. ఎమ్మెల్యేకు చెందిన బార్‌ పై తనిఖీల పేరుతో పాత సీసాలను తీసుకెళ్లి సమీపంలోని చెరువు దగ్గర లేబుల్స్‌ తీసి చీప్‌ లిక్కర్‌ నింపించారు. సీసీ కెమెరాలను బంద్‌ చేయాలని ఆదేశించారు. అయితే..ఎక్సైజ్‌ పోలీసుల ఓవరాక్షన్‌ బార్‌ లోని సీసీ కెమెరాలో రికార్డ్‌ అవటంతో ఎక్సైజ్‌ పోలీసులు తోకముడిచారు.

స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. నామినేషన్‌ ప్రక్రియలో మొత్తం 43 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఎనిమిది చోట్ల సెక్షన్‌ 307 కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లాలో వైసీపీ వర్గపోరు రచ్చకెక్కింది. కోట మండలం తిన్నెలపూడిలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి చంద్రను.. మరో వర్గానికి చెందిన నాయకులు కిడ్నాప్‌ చేశారు. నామినేషన్ వెనక్కు తీసుకోకుంటే.. ఫ్యామిలీని సైతం చంపేస్తామంటూ బెదిరించినట్టు చంద్ర కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story