వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ జనసేన ఎంపీటీసీ అభ్యర్ధి గెడ్డం లక్ష్మి ఆవేదన

X
TV5 Telugu15 March 2020 1:42 PM GMT
నామినేషన్ వేసిన రోజు నుంచి వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ వాపోయారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వెంప జనసేన ఎంపీటీసీ అభ్యర్ధి గెడ్డం లక్ష్మి. దీంతో కూతురితో కలిసి వేరే చోట తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జనసేన కార్యకర్తలే తనకు అండగా ఉన్నారన్నారు. తనకు రక్షణ కల్పించాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story