ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

స్థానిక ఎన్నికలు 6 వారాలు వాయిదా పడడాన్ని వైసీపీ సర్కార్ జీర్ణించుకోలేకపోతోంది. గవర్నర్ వద్ద ఇప్పటికే దీనిపై పంచాయితీ పెట్టిన CM జగన్.. ఇప్పుడు సుప్రీంకి వెళ్లారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల వాయిదాను సవాల్‌ చేస్తూ వేసిన ఈ పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుంది. దీన్ని మంగళవారం రెగ్యులర్ లిస్టులో చేర్చాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను జస్టిస్ లలిత్ ఆదేశించారు. ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా కరోనా వైరస్ పేరుతో ఎన్నికలు వాయిదా వేశారని జగన్ మండిపడుతున్నారు. SECయే సర్వస్వం అన్నట్టు వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. కరోనా వ్యాప్తి దేశమంతా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు రమేష్ కుమార్ చెప్పినా దాన్ని అంగీకరించేందుకు CM సహా YCP నేతలు ఎవరూ సిద్ధం లేరు.

Tags

Read MoreRead Less
Next Story