స్థానిక ఎన్నికల రద్దుపై ప్రతిపక్షాల హర్షం

స్థానిక ఎన్నికల రద్దుపై ప్రతిపక్షాల హర్షం

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమష్ కుమార్ పై సీఎం జగన్ చేసిన ఆరోపణలు హస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు. దాడులు, కుట్రలతో జరిగిన ఏకగ్రీవాలను కూడా రద్దు చేసి ఎన్నికల ప్రక్రియను పూర్తిగా మళ్లీ ప్రారంభించాలని కోరారు ఆయన.

ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదాపై విశాఖ టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీ అరాచకాలుకు అడ్డుకట్ట పడిందన్నారు. పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విశాఖ టీడీపీ నేతలు ఆరోపించారు.

సీఎం వైఎస్ జగన్ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడటం చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సీఎం జగన్‌పై ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. ఈసీ అధికారాలు తెలియని వ్యక్తి సీఎం అవడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. ఈసీ తన విస్తృతాధికారాలు ఉపయోగించినప్పుడు.. ఈసీకి దురుద్దేశాలు ఆపాదించడం మంచిదికాదన్నారు.

అయితే..వైసీపీ మాత్రం ఈసీ నిర్ణయాన్ని ఏకపక్ష నిర్ణయమని ఆరోపిస్తోంది. కనీసీం సీఎం, సీఎస్ ను కూడా సంప్రదించకుండా కరోనా అంటూ ఎన్నికలను వాయిదా వేయటం తగదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈసీ నిర్ణయంపై తాము న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఎస్ఈసీ నిర్ణయం వెనక టీడీపీ ఒత్తిడి ఉంది అనేది బొత్స వాదన. ఈసీ విచక్షణాధికారాలు ఉపయోగించింది అనే పదం వాడిన చంద్రబాబు..గతంలో మండలి చైర్మన్ కూడా మూడు రాజధానుల విషయంలో విచక్షణాధికారం అనే పదాన్ని వాడినట్లు గుర్తు చేశారు. అందుకే ఈసీ నిర్ణయం వెనక టీడీపీ కుట్ర ఉందన్నారు బొత్స.

Tags

Read MoreRead Less
Next Story