కరోనా ఎఫెక్ట్.. సినిమా షూటింగ్‌లు బంద్

కరోనా ఎఫెక్ట్.. సినిమా షూటింగ్‌లు బంద్

తెలంగాణలో కరోనాతో ఇప్పటికిప్పుడు దడపుట్టే పరిస్థితి లేకున్నా..డేంజర్ సైరన్ మాత్రం మోగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. రెండు శాంపిల్స్ పై అనుమానం ఉండటంతో పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అయితే..వాటిలో ఓ శాంపిల్ పాజిటీవ్ అని తేలింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మూడుకు చేరింది. మరోవైపు తొలి కరోనా పేషెంట్ గాంధీ ఆస్పత్రిలో చికిత్ప పొందిన తర్వాత పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు.

కరోనా మరణాల రేటు 3 నుంచి మూడున్నర శాతమేనన్నారు ఈటల రాజేందర్. కరోనా సోకితే కచ్చితంగా చనిపోతారన్నది అపోహ మాత్రమేనని.. ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన పనిలేదన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు.

కరోనా నేపథ్యంలో తెలంగాణలో రాజ్‌భవన్ వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గవర్నర్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలనూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు కరోనా ఎఫెక్ట్ తో సోమవారం నుంచి సినిమా షూటింగ్స్ ను నిలిపివేస్తున్నామని టాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. షూటింగ్స్ లో చాలా మంది టెక్నికల్ టీం పని చేస్తుంటుందని, వాళ్ల ఆరోగ్య కారణంతో షూటింగ్ 31 వరకు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోసారి సమావేశమై..తిరిగి షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

కరోనాను ఎదుర్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పకడ్బందీ చర్యలకు అనుగుణంగా జిల్లా యంత్రాగం అప్రమత్తం అయింది. కరోనా కట్టడికి నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్ తో పాటు అన్ని జిల్లాల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఐసొలేషన్ వార్డు, ఐసీయూ ను ఆయన సందర్శించారు. మాస్కులు, శానిటైజర్లు ఎక్కువధరకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

వైరస్‌ అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సినిమా థియేటర్స్‌ను మూసివేయాలని ఆదేచినా.. వరంగల్‌లో మాత్రం సీఎం ఆదేశాలు లైట్ తీసుకున్నారు. ఏమాత్రం లేక్క చేయకుండా దర్జాగా సినిమా థియేటర్లు ఓపెన్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story