పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా అనుమానిత కేసు నమోదు

కరోనా మహమ్మారి ఏపీని హడలెత్తిస్తోంది. వ్యాధి నివారణకు ప్రభుత్వం పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా.. అక్కడక్కడ మాత్రం అనుమానిత కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కరోనా అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో మరో అనుమానిత కేసు నమోదు అయింది. కృష్ణా జిల్లా ఆచవరంకి చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలను గుర్తించారు వైద్యులు. ఏలూరు ఆస్పత్రిలోఈ కేసు నమోదు అయింది. దీంతో వెంటనే అప్రమత్తం అయిన వైద్యులు.. అనుమానితుడిని ఏలూరు జీహెచ్‌లో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించామని.. రిపోర్టు వచ్చాక వ్యాధి ఏంటనేది నిర్ధారిస్తామని వైద్యులు చెబుతున్నారు. బాధితుడి ఇటీవలే హైదరాబాద్ కు వెళ్లొచ్చినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com