Top

సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం

సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం
X

సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశ పెట్టారు. పార్లమెంట్‌లో సీఏఏ బిల్లు వచ్చినప్పుడే టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్న 8వ రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇప్పటికే బెంగాల్, కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్‌లు సీఏఏను వ్యతిరేకించి తీర్మానాలు చేశాయన్నారు.

సీఎం అయిన తనకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదన్నారు కేసీఆర్‌.. అలాంటింది కోట్ల మందికి బర్త్‌ సర్టిఫికెట్లు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు.. సీఏఏ అన్నది కేవలం ముస్లింల సమస్యమాత్రమే కాదన్నారు. అయితే ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలని దాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారు. దేశంలోకి చొరబాటుదారులు రాకుండా అడ్డుకోవాల్సిందేనని.. అందుకు టిఆర్‌ఎస్‌ పూర్తిగా సహకరిస్తుందన్నారు.

Next Story

RELATED STORIES