Top

అనంతపురం జిల్లాలో దారుణం.. వేటకొడవళ్లతో దాడి

అనంతపురం జిల్లాలో దారుణం.. వేటకొడవళ్లతో దాడి
X

అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం జరిగింది. వెలుగు కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్న రామ్మోహన్‌పై ఇద్దరు వేట కొడవళ్లతో దాడి చేశారు. దీంతో ఆయన కుప్పకూలాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. రామ్మోహన్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈకేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అయితే దాడి జరిగిన వెలుగు కార్యాలయం పక్కనే వైసీపీ కార్యాలయం ఉంది. పోలీసుల చెక్‌పోస్టు కూడా అక్కడే ఉంది. అయినా కూడా నిందితులు అంత దైర్యంగా వేట కొడవళ్లతో దాడి చేశారంటే.. పోలీసులు పట్టించుకోలేదా అని స్థానికులు ప్రశ్నించారు. తాడిపత్రిలో శాంతి భద్రతలు ఎంత బాగా అదుపులో ఉన్నాయో ఈ ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES