కరోనా ఎఫెక్ట్‌ తో విదేశాల్లో చిక్కుకుపోయిన ఇండియన్స్‌

కరోనా ఎఫెక్ట్‌ తో విదేశాల్లో చిక్కుకుపోయిన ఇండియన్స్‌

కరోనా ప్రభావంతో చాలా దేశాలు ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులను నిలిపివేస్తున్నాయి. యూరప్, గల్ఫ్ కంట్రీస్ లో పలు దేశాలు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. కొన్ని దేశాలు మాత్రం కరోనా నెగటీవ్ సర్టిఫికెట్లు, హెల్త్ డిక్లరేషన్స్, ఆయా దేశాల ఎంబసీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇలా షరతులతో కూడిన ప్రయాణాలను అనుమతి ఇస్తున్నాయి. దీంతో విదేశాల్లోని ఇండియన్స్ కు కష్టాలు తప్పటం లేదు.

కరోనాతో అల్లాడుతున్న మరో దేశం ఫిలిఫ్సిన్స్. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో పిలిఫ్పీన్స్ లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించాల్సి వచ్చింది. అలాగే ఫారెన్ స్టూడెంట్స్ అందరూ 72 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఫిలిఫ్పీన్స్ నుంచి తిరుగు ప్రయాణం అయిన మెడికో స్టూడెంట్స్ మనీలా ఎయిర్ పోర్టుతో పాటు మలేషియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. పిలిఫ్పీన్స్ తిరుగు ప్రయాణంలో దాదాపు 300 మంది మెడికో స్టూడెంట్స్ మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. అయితే..కౌలాంపూర్ ఎయిర్ పోర్టులోకి రావటానికి అధికారులు అనుమతించటం లేదు. ఇండియన్ ఎంబసీ నుంచి అనుమతి కావాలంటూ మెలిక పెట్టారు. దీంతో తిండితిప్పలు లేకుండా వారు కౌలాలంపూర్ లో సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

మరో 50 మంది మెడికో విద్యార్ధులు మనీలా ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. తిరిగి వెళ్దామంటే పిలిఫ్సీన్స్ లో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ తో పాటు విదేశీ విద్యార్ధులపై ఆంక్షలు ఉండటంతో స్టూడెంట్స్ అవస్థలు పడుతున్నారు. కౌలాంపూర్, మనీలా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన విద్యార్ధుల్లో ఎక్కువమంది తెలుగు విద్యార్ధులే.

అయితే..మెడికో స్టూడెంట్స్ చిక్కుకుపోయిన అంశంపై దృష్టి సారించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. వారిని ఇండియా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధిరారులు వెల్లడించారు. ఎయిర్ ఎసియాతో సంప్రదింపులు జరిపామని.. విద్యార్ధులను ఢిల్లీ, విశాఖకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story