సునిసిత్‌పై పోలీస్ కంప్లైంట్ చేసిన లావణ్య త్రిపాఠి

సునిసిత్‌పై పోలీస్ కంప్లైంట్ చేసిన లావణ్య త్రిపాఠి
X

టాలీవుడ్‌ నటి లావణ్య త్రిపాఠికి సోషల్‌ మీడియా వేధింపులు తప్పడం లేదు. తనపై సునిషిత్‌ అనే వ్యక్తి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అసిస్టెంట్‌ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేసింది. సునిషిత్‌ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారని.. అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని.. యూట్యూబ్‌ ఛానెల్స్‌లో సునిషిత్‌ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని సైబర్‌ క్రైం ఏసీపీ ప్రసాద్‌ తెలిపారు. పూర్తి ఆధారాలు సేకరించి త్వరలో నిందితున్ని అరెస్ట్‌ చేస్తామని అన్నారు.

Next Story

RELATED STORIES