మధ్యప్రదేశ్‌ రాజకీయాలతో హీటెక్కిన బెంగళూరు

మధ్యప్రదేశ్‌ రాజకీయాలతో హీటెక్కిన బెంగళూరు
X

మధ్యప్రదేశ్‌ రాజకీయాలతో బెంగళూరు హీటెక్కింది. రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌ ఎదుట కాంగ్రెస్ ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు అనుమతించాలంటూ సీనియర్‌ నేత దిగ్విజయ్ సింగ్ హోటల్‌ వద్దకు వచ్చారు. ఆయన వెంటకాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా ఉన్నారు. అయితే వీరిని లోపలికి అనుమతించలేదు పోలీసులు. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో దిగ్విజయ్‌ సింగ్ ను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు పోలీసులు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి..బీజేపీ డ్రామాలాడుతోందంటూ మండిపడ్డారు దిగ్విజయ్ సింగ్.

మధ్యప్రదేశ్‌లో బలపరీక్షపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరగనుంది. కమల్‌నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని, తక్షణమే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ బీజేపీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. బుధవారం సమాధానం చెప్పాలని కమల్‌నాథ్‌ సర్కారును ఆదేశించింది. యువ నేత జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌లో ముసలం ఏర్పడింది. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ ప్రతిపక్షాలు కమల్‌నాథ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి.

Next Story

RELATED STORIES