యువతి విషయంలో గొడవ.. మధ్యవర్తిపై కత్తితో దాడి

యువతి విషయంలో గొడవ.. మధ్యవర్తిపై కత్తితో దాడి
X

ఇద్దరు ఆకతాయిల మధ్య ఘర్షణ.. ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. గొడవ వద్దన్ని చెప్పిన పాపానికి.. మధ్యవర్తిని దారుణంగా హత్య చేశారు కిరాతకులు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి విషయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు ఆకతాయిలు గొడవ పడ్డారు. తన షాపు ముందు ఘర్షణ జరుగుతుండంతో.. లతీఫ్‌ అనే వ్యక్తి వారిని నిలువరించే ప్రయత్నం చేశాడు. గొడవ వద్దు.. ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకోవాలని చెప్పినందుకు కోపొద్రిక్తుడైన ఓ యువకునికి చెందిన వర్గీయులు లతీఫ్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. కత్తులతో దాడి చేయడంతో లతీఫ్‌ మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Next Story

RELATED STORIES