భారత్‌లో పెరుగుతున్న కరోనా బాధితులు.. దేశవ్యాప్తంగా మరింత కఠిన ఆంక్షలు

భారత్‌లో పెరుగుతున్న  కరోనా బాధితులు.. దేశవ్యాప్తంగా మరింత కఠిన ఆంక్షలు

భారత్‌లో కరోనా బాధితులు పెరుగుతున్నారు. వైరస్ తీవ్రత పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. దేశవ్యాప్తంగా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నారు. 2 వారాల క్రితం కాస్త నెమ్మదిగా విస్తరించిన వైరస్, ఇప్పుడు వేగంగా అంటుకుంటోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 160కి చేరింది. బాధితుల్లో ముగ్గురు మృతి చెందారు. మహారాష్ట్రలో అత్యధికంగా 42 కేసులు నమోదయ్యాయి. కేరళ-27, ఉత్తర ప్రదేశ్-16, హర్యానా-16, కర్ణాటక-10, ఢిల్లీ-10, లఢాఖ్‌లో 8 కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో బాధితుల సంఖ్య 13కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో కరోనా ప్రభావం కనిపిస్తోంది.

భారత సైన్యానికి కూడా కరోనా అంటుకుంది. ఆర్మీలో ఒక జవానుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్దారించారు. వెంటనే అతన్ని క్వారంటైన్ చేశారు. ఐసోలేషన్ వార్డులో అతనికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. బాధిత జవాన్‌ను లఢాఖ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ జవాన్‌ తండ్రి ఫిబ్రవరిలో ఇరాన్ పర్యటనకు వెళ్లారు. ఫిబ్రవరి 27న భారత్‌కు తిరిగి వచ్చారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు బయటపడింది. ఆయన నుంచి జవాన్‌కు కూడా వైరస్ అంటుకుందని వెలుగుచూసింది. దాంతో సైన్యంలో మిగతా వాళ్లకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. అలాగే, ఆర్మీకి సంబంధించిన అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను రద్దు చేశారు. ఉన్నతాధికారులకు సెలవులు రద్దు చేశారు.

వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌-లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ ఆస్పత్రిలో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ డాక్టర్‌ కరోనా బాధితులకు చికిత్స అందించారు. ట్రీట్‌మెంట్ చేసిన సమ యంలోనే ఆ వైద్యునికి కరోనా సోకినట్లు సమాచారం. దాంతో అతన్ని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తు న్నారు.గోవాలో ఓ విదేశీయునికి కరోనా సోకినట్లు గుర్తించారు. నార్వే నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అతన్ని పనాజీలోని ఓ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. అలాగే ఆ ఫారినర్ ఢిల్లీ, ఆగ్రా, మేఘాలయాల్లో ప్రయా ణించినట్లు తెలుసుకున్న అధికారులు, ఆ విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించారు.

Tags

Read MoreRead Less
Next Story