బ్రేకింగ్.. రాజధాని తరలింపులో జగన్‌కు తొలి ఎదురుదెబ్బ

బ్రేకింగ్.. రాజధాని తరలింపులో జగన్‌కు తొలి ఎదురుదెబ్బ

కర్నూలుకు ప్రభుత్వ ఆఫీసుల తరలింపులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. అమరావతి నుంచి కర్నూలుకు విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరిస్ ఆఫీసులను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వ్యూలు జారీ చేసింది.

అమరావతి నుంచి కర్నూలుకు విజిలెన్స్ ఆఫీస్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైయిరి ఆఫీసును తరలిస్తూ జీవో 13ను విడుదల చేసింది. అయితే.. విజిలెన్స్ కమిషనరు ఆఫీసు కర్నూల్ కు తరలించటంపై విడుదల చేసిన జీవో 13పై సీఎస్ సంతకం లేకపోవటం, అలాగే ఉద్యోగుల పనితీరుపై కన్నేసి ఉంచే విజిలెన్స్ కమిషన్ ఆఫీసును సెక్రటరియేట్ కు దూరంగా తరలించటంపై పిటీషనర్ కారుమంచి ఇంద్రనీల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దురుద్దేశంతో కూడుకున్న చర్య అని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం జీవో 13ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వ్యూలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story