కరోనా బారిన పడ్డ బాలీవుడ్ పాపులర్ సింగర్

కరోనా బారిన పడ్డ బాలీవుడ్ పాపులర్ సింగర్
X

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా వైరస్ భారిన పడ్డారు. బేబీ డాల్ మరియు చిట్టియాన్ కలైయాన్ పాటలకు ప్రసిద్ధి చెందిన సింగర్ కనికా కపూర్ కు శుక్రవారం కరోనావైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో వచ్చింది. అంతకుముందే ఆమెను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కెజిఎంయు) ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. 41 ఏళ్ల పాపులర్ సింగర్ కొంతకాలం లండన్‌లో ఉంటున్నారు.. గతవారమె లక్నోకు తిరిగి వచ్చారు. అయితే ఆమె తన ప్రయాణాన్ని గురించి అధికారులకు తెలిజేయలేదు. లక్నో చేరుకున్న తరువాత, కనికా తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో విలాసవంతమైన పార్టీని ఇచ్చారు.

నివేదికల ప్రకారం ఆమె ఇచ్చిన పార్టీకి బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు మరియు సామాజికవేత్తలు హాజరయ్యారు. అంతేకాదు లక్నోలోని విశాల వంతమైన అపార్ట్మెంట్లో ఆమె బస చేశారు. దాంతో ఆమె బస చేసిన మొత్తం భవనాన్ని నిర్బంధించారు. అలాగే పార్టీకి ఎవరెవరు అతిథులను వచ్చారో తెలుసుకొని పరీక్షలు చెయ్యాలని ఆదేశించారు అధికారులు. పార్టీలో పాల్గొన్న వ్యక్తులు కూడా తమకు తాము నిర్బంధం విధించుకోవాలని సూచించారు. లక్షణాలు తీవ్రమైతే వైద్యులను సంప్రదించాలని కోరారు. కాగా కనికా తండ్రి రాజీవ్ కపూర్ మాట్లాడుతూ.. తన కూతురు లండన్ నుండి లక్నో చేరుకున్న తర్వాత మూడు పార్టీలకు హాజరయ్యారని చెప్పారు. మూడు పార్టీలలో 350-400 మంది వ్యక్తులతో మాట్లాడిందని. తమ కుటుంబంలో కూడా ఆరుగురుకి పరీక్షలు చేశారని.. కనికాతో పాటు తాము కూడా నిర్బంధంలో ఉన్నట్టు చెప్పారు.

Next Story

RELATED STORIES