పశ్చిమగోదారి జిల్లాలో ఎగ్ మేలా

కరోనా వైరస్.. పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభాన్నే చూపింది. కోడి మాంసం, గుడ్డు తింటే కరోనా వైరస్ వస్తుందనే వందతులతో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. డిమాండ్ తగ్గడంతో ధరలు విపరీతంగా పడిపోయాయి. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పౌల్ట్రీ నిర్వహకులు అవాగాహన సదస్సు నిర్వహించారు. ఎగ్ మేలా పెట్టి.. ఉడికించిన కోడిగుడ్లను ఉచితంగా అందరికి పంచి పెట్టారు. దీంతో పాటు.. కరోనా వైరస్ వ్యాప్తిపట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశ్రుభత పాటించడం, సోషల్ డిస్టెన్స్ పాటిస్తే కరోనాను నివారించగలమని పేర్కోన్నారు. ప్రతివ్యక్తి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలన్నారు. చికెన్, కోడిగుడ్డు తింటే కరోనా వస్తుందనే అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. కోడిమాంసం, గుడ్డు తింటే.. మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. దీని ద్వారా కరోనాను సమర్దంగా ఎదుర్కోగలమన్నారు. వైరస్ వ్యాప్తితో పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ధరలు విపరీతంగా పడిపోవడంతో.. అటు మొక్కజొన్న రైతులు, కోళ్ల ఫారాల నిర్వహకులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్, గుడ్డు తింటే కరోనా వస్తుందనే ఆపోహలను ప్రజలను నమ్మవద్దన్నారు. ప్రజలు చికెన్, ఎగ్ తినాలని ప్రోత్సహించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com