ఏపీ అధికార పక్షానికి కేంద్ర హోంశాఖ ఝలక్‌

ఏపీ అధికార పక్షానికి కేంద్ర హోంశాఖ ఝలక్‌

ఏపీ అధికార పక్షానికి కేంద్ర హోం శాఖ ఝలక్‌ ఇచ్చింది. తనకు రక్షణ కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్‌ కుమార్‌ లేఖ రాసిన మాట వాస్తవమే అంటూ నిర్ధారించింది. నీరజ్‌ ‌కుమార్‌ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు హోం శాఖ సమాధానం ఇచ్చింది. తాను అడిగిన ప్రశ్నలతో పాటు హోంశాఖ ఇచ్చిన సమాధానాన్ని నీరజ్‌ కుమార్‌ ట్విట్టర్‌లో ఉంచారు. దీంతో లేఖపై అసత్యాలు ప్రచారం చేస్తున్న అధికార వైసీపీ కి మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఇప్పటికే సుప్రీం కోర్టు సైతం ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు కేంద్రం హోం శాఖ షాక్‌ ఇచ్చింది..

అయితే ఇప్పటి వరకు ఎస్‌ఈసీ లేఖపై అధికార పక్షంతో పాటు దొంగ మీడియా వితండవాదం చేస్తూ వస్తోంది. అసలు ఎస్‌ఈసీ లేఖే రాయలేదంటూ దొంగ మీడియా గగ్గోలు పెట్టింది. లేఖ ప్రసారం చేసిన టీవీ5తో సాహా, ఇతర చానళ్లను పచ్చమీడియా అంటు దొంగమీడియా అరుపులు అరిచింది.

మరోవైపు తనకు ఏపీలో రక్షణ లేదని.. తనతో పాటు, తన కుటుంబానికి ప్రాణహానీ ఉందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమగడ్డ ప్రసాద్‌.. కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఆ లేఖలు పలు అంశాలను ప్రస్తావించారు.. సాక్షాత్తు సీఎం జగన్‌, మంత్రులు, స్పీకర్, ఇతర ప్రజాప్రతినిధులు తనపై దూషణకు దిగారని లేఖలో వివరించారు. వెంటనే తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖలో కోరారు.. ఆ లేఖ రాసిన తరువాత ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చేశారు..

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పటి నుంచి నిమ్మగడ్డ రమేష్‌, ఆయన కుటుంబ సభ్యులను వైసీపీ బ్యాచ్‌ టార్గెట్‌ చేస్తూ వచ్చింది. సోషల్‌ మీడియాలో సైతం అడ్డగోలుగా ప్రచారం మొదలెట్టింది. అక్కడితో ఆగకుండా అసలు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కేంద్రానికి లేక రాయలేదని.. అది అంతా పచ్చమీడియా కట్టు కదలు అంటూ దొంగ మీడియా గొగ్గోలు పెట్టింది. టీవీ5 పై అసత్య ప్రచారాలు చేసిన వారందరికీ కేంద్రం సరైన సమాధానం చెప్పింది. ఎస్‌ఈసీ లేఖ రాసింది నిజమే అని స్పష్టం చేసింది..

వాస్తవాలకు ప్రతిరూపమైన టీవీ 5 ఎప్పుడూ వాస్తవాలను మాత్రమే ప్రసారం చేస్తుంది. అధికారంలో ఎవరు ఉన్నా ప్రజల పక్షాన.. న్యాయం తరుపున మాత్రమే నిలబడుతుంది. మరోసారి టీవీ5 విశ్వసనీయత రుజువైంది.

Tags

Read MoreRead Less
Next Story