బ్రేకింగ్.. సీఎం కమల్ నాథ్ రాజీనామా

బ్రేకింగ్.. సీఎం కమల్ నాథ్ రాజీనామా

మధ్యప్రదేశ్ లో బలపరీక్షకు ముందు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. సీఎం రాజీనామాకు కొన్ని గంటల ముందు అనూహ్య రాజకీయాలు చేసుకుంటున్నాయి. జ్యోతిరాధిత్య సింధియా టీంలోని 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించారు. సింధియా వర్గానికి చెందిన 20 మంది రాజీనామా చేయగా అందులో నలుగురు మంత్రుల రాజీనామాలకు స్పీకర్ గతంలోనే ఆమోదం తెలిపారు. ఇక ఇప్పుడు మిగిలిన 16 మంది రిసిగ్నేషన్లను కూడా ఒకే చేశారు.

స్పీకర్ ప్రజాపతి నిర్ణయం కమల్ నాథ్ ప్రభుత్వానికి మరింత ప్రాణసంకటంగా మారింది. 16 మంది ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదంతో సభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 92కి పడిపోయింది. ప్రతిపక్ష బీజేపీకి సొంతగా 107 ఎమ్మెల్యేలతో పాటు, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీస్పీ, ఓ ఎస్పీ సభ్యుడి మద్దతుగా కూడా ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 104 మంది సభ్యుల మద్దతు సరిపోతుంది. ఈ నేపథ్యంలో సీఎం కమల్ నాథ్ రాజీనామా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story