నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలకు ముందు ఏం జరిగిందంటే?

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలకు ముందు ఏం జరిగిందంటే?

నిర్భయకేసులో దోషులకు ఉరిశిక్ష పడింది. తీహార్ జైలులో శుక్రవారం 5.30 గంటలకు నలుగురు దోషుల్ని.. తలారీ పవన్‌ జల్లాద్‌.. ఉరితీశాడు. ఉరి అమలు చేసే సమయంలో జైలు సూపరిండెంట్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌, మెడికల్‌ ఇంఛార్జ్‌ ఆఫీసర్‌, రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీస్‌, జిల్లా మెజిస్ట్రేట్‌ సహా పలువురు పోలీసులు అధికారులు ఉన్నారు. అంతుకు ముందు నలుగిరికి వైద్య పరీక్షలు చేశారు. అందరి ఆరోగ్య పరిస్థితి బాగుందని నిర్ధారించిన తర్వాత.. ఉరి అమలు చేసినట్లు తెలిపారు అధికారులు.

ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు నిర్భయ దోషులు. పటియాలకోర్టు, ఢిల్లీ హైకోర్టుతో పాటు, చివరికి సుప్రీంకోర్టులోనూ వారికి చుక్కెదురైంది. ఉరిశిక్షను యథాతతంగా అమలు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.... సుప్రీంలో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ తెల్లవారు జామున 4 గంటల సమయంలో... విచారణ చేపట్టిన సర్వోన్నతన్యాయస్థానం దోషుల పిటీషన్‌ను కొట్టేసింది. జస్టిస్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ బోపన్నలతో కూడిన ధర్మానసం ఈ మేరకు తీర్పు వెలువరించింది. మరోవైపు.. నిర్భయ దోషులను కనీసం కలిసేందుకు కుటుంబసభ్యులకు 5-10 నిమిషాలు అనుమతి ఇవ్వాలని వారి తరపున్యాయవాది ఎపీ సింగ్‌ కోర్టును కోరారు. దీనిపై స్పందించిన సోలిటర్‌ జనరల్‌ తుషార్‌.. జైలు నియమాలు దీనికి అనుమవతించవని స్పష్టం చేశారు.

అంతకు ముందు.. పటియాల హౌస్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు దోషులు. రాత్రి 10 గంటల సమయంలో విచారణ చేపట్టిన హైకోర్టు ఉరిశిక్షను యథాతథంగా అమలు చేయాలని తీర్పునిచ్చింది. వాదనలు వినిపించడం కాదు..లీగల్‌ పాయింట్‌ మాత్రమే మాట్లాడాలంటూ.. దోషుల తరపు లాయర్‌ ఏపీ సింగ్‌కు సూచించింది ధర్మాసనం. అనవసరంగా టైం వేస్టు చేయవద్దని, మీ క్లయింట్లు దేవుడి దగ్గరికి వెళ్లే సమయం ఆసన్నమైందని కోర్టు వ్యాఖ్యానించింది. విడాకులు కోరుతూ దోషి అక్షయ్‌ భార్య దాఖలు చేసిన పిటీషన్‌కు, మరణశిక్ష వాయిదా వేయడానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. వ్యవస్థతో ఎవరో ఆటలాడుకుంటున్నారంటూ న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా మీరేం చేస్తున్నారంటూ లాయర్‌ను ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story