ఏపీలో ఎస్‌ఈసీ వర్సెస్‌ సర్కార్‌గా మారిన పరిస్థితి

ఏపీలో ఎస్‌ఈసీ వర్సెస్‌ సర్కార్‌గా మారిన పరిస్థితి

ఏపీలో ప్రస్తుతం ఎస్‌ఈసీ వర్సెస్‌ సర్కార్‌గా పరిస్థితి మారింది.. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయడం.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడం.. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని అత్యున్నత ధర్మాసనం సమర్ధించడం చకచకగా జరిగిపోయాయి. దానిపై ఇప్పటికే మాటల మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో తనకు ప్రాణహాని ఉందంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేంద్ర హోం శాఖ కార్యదర్శి లేఖ రాశరంటూ ప్రచారం జరిగింది. ఈ లేఖ ఆయనే స్వయంగా రాశారంటూ విపక్షాలు.. ఇది ఫేక్‌ లేక అంటూ ప్రభుత్వం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. లేఖ ఎవరు రాశారు అనేదానిపై పూర్తి క్లారిటీ రాకపోయినా.. కేంద్రం మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు భారీగా భద్రత పెంచింది..

విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న ఎస్‌ఈసీ కార్యాలయం దగ్గర 10 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు భద్రతగా ఉన్నారు. గన్నవరంలోని సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్‌కు చెందిన 1 ఎస్సై, 1 హెడ్ కానిస్టేబుల్, 8 మంది కానిస్టేబుళ్లతో భద్రత కల్పించారు. అటు హైదరాబాద్‌లో రమేష్ కుమార్‌ నివాసం దగ్గర కూడా భద్రత పెంచారు.

కేంద్ర హోం శాఖకు రమేష్‌ కుమార్‌ లేఖ రాశారని అందుకే కేంద్రం భద్రత పెంచిందని విపక్షాలు వాధిస్తున్నాయి. ఆయన రాసినట్టు చెబుతున్న లేఖ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ తనకు తన కుటుంబానికి ఎలాంటి భద్రతా లేదని.. కేంద్రప్రభుత్వ బలగాలతో రక్షణ కల్పించాలని. ఇక్కడి పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహనం, వారి ఫ్యాక్షన్ చరిత్ర, కక్షసాధింపు వైఖరితో తాను ఈ నిర్ణయానికి వచ్చినట్టు లేఖలో ఉంది.. అటే ఇదే అంశంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ కూడా కేంద్రానికి లేఖ రాశారు.. లేఖ సంగతి ఎలా ఉన్నా.. ఎస్‌ఈసీ కేంద్రం భద్రత పెంచడంతో.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నాయో అన్నదానికి అద్దం పడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story