తిరుమల చరిత్రలో తొలిసారి శ్రీవారి దర్శనాలు నిలిపివేత.. గుట్టుచప్పుడు కాకుండా లడ్డూలు తరలింపు

తిరుమల చరిత్రలో తొలిసారి శ్రీవారి దర్శనాలు నిలిపివేత.. గుట్టుచప్పుడు కాకుండా లడ్డూలు తరలింపు

కరోనా ప్రభావంతో తిరుమల చరిత్రలో తొలిసారి శ్రీవారి దర్శనాలు నిలిపివేశారు. దీంతో తిరుమల కొండ భక్తులు లేక వెలవెబోతోంది. క్యూలైన్లు, మాఢవీధులు, లడ్డూ కౌంటర్లు అన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రతినిత్యం దేశవిదేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తుంటారు. వీరికోసం కావాల్సినన్ని లడ్డూలు అందుబాటులో ఉంచుతారు. అయితే, దర్శనాలు నిలిపివేయడంతో లడ్డూ ప్రసాదం స్వీకరించే భక్తులే కరువయ్యారు. దీంతో దాదాపు రెండు లక్షల లడ్డూలు మిగిలిపోయాయి. వీటిని ఆగమేఘాలమీద చైన్నైకి తరలిస్తోంది టీటీడీ. టీటీడీ అనుబంధ ఆలయాలు, టీటీడీ సమాచార కేంద్రాలకు తరలిస్తున్నారు. గత పదిరోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గుతూ వస్తున్నా.. అవసరానికి మించి లడ్డూలు తయారు చేశారు. లడ్డూ నిల్వలు పేరుకుపోవడంతో ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story