మార్చి 31 వరకు అన్ని రైళ్లు రద్దు..

మార్చి 31 వరకు అన్ని రైళ్లు రద్దు..

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 వరకు అన్ని రైల్వే కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయెల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మార్చి 22 అర్ధరాత్రి నుండి మార్చి 31 అర్ధరాత్రి వరకు కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తాయని.. ప్రీమియం రైలు సేవలు, మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు అన్ని నిలిచిపోతాయని భారతీయ రైల్వే తెలిపింది. ఈ మేరకు ఈ రోజు జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story