ఏపీలో కరోనా ప్రభావాన్ని ఎట్టకేలకు ఒప్పుకున్న జగన్ ప్రభుత్వం

ఏపీలో కరోనా ప్రభావాన్ని ఎట్టకేలకు ఒప్పుకున్న జగన్ ప్రభుత్వం

ఏపీలో కరోనా ప్రభావాన్ని జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకుంది. కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉందంటూ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. హెచ్‌వోడీ కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో ఉద్యోగులు 2 గ్రూప్‌లుగా విడిపోయి విధులకు హాజరు కావొచ్చని సూచించింది. 60 ఏళ్లు పైబడిన సలహాదారులు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలిచ్చింది. వైద్య ధృవీకరణ లేకపోయినా ఏప్రిల్‌ 4 వరకూ ఇంటి నుంచే పనిచేసే ఛాన్స్ కల్పించింది. ఈ నిబంధనలు ప్రభుత్వ, సహకార, స్వయంప్రతిపత్తి సంస్థలన్నింటికీ వర్తించేలా జీవో జారీ చేశారు. నిన్నటివరకూ స్థానిక ఎన్నికల కోసం పట్టుపట్టిన ప్రభుత్వం ఇప్పుడిలా రివర్స్ గేర్‌ వేస్తూ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ ఇవ్వడం బట్టే వాస్తవానికీ, ప్రభుత్వం మొండివాదనకు ఎంత తేడా ఉందో అర్థమవుతోంది.

నిన్న కూడా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఎన్నికల వాయిదాను తప్పుపట్టారు. ఈ తీరుపై విమర్శలు వచ్చినా మంత్రులు, ఇతర YCP నేతలు తగ్గలేదు. తీరా ఇప్పుడు వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కు అనుతివ్వడం ద్వార కరోనా ఎఫెక్ట తీవ్రంగా ఉందని వాళ్లే ఒప్పుకున్నట్టు అయ్యింది. ఈ ప్రభుత్వం మొదట్నుంచి కోవిడ్ వ్యాప్తి, నిరోధాన్ని అంచనా వేయడంలో వైఫల్యం చెందింది. స్థానిక ఎన్నికల వాయిదాపై ప్రజలంతా ఎస్‌ఈసీ నిర్ణయం సరైందేనంటున్నా అడ్డగోలుగా ఎదురుదాడి చేశారు సీఎం సహా వైసీపీ నేతలు. ఎలక్షన్ల నాటికి కరోనా ప్రభావం ఉండబోదంటూ అధికారపక్షం ఇష్టారీతిన ప్రకటనలు చేసింది. షెడ్యూల్ ప్రకారం 21, 23 తేదీల్లో జరగాల్సిన స్థానిక ఎన్నికలు జరపాల్సిందేని కోరింది. సుప్రీంలో భంగపాటు తర్వాత కూడా వాయిదాను తప్పుపడుతూనే ఉన్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం అంటే కోవిడ్‌-19 ప్రభావాన్ని ఒప్పుకున్నట్టే కదా? ఇప్పటికైనా ఎన్నికల వాయిదా సరైందేనని ప్రభుత్వం ఒప్పుకుంటుందా? కర్ఫ్యూ తరహా పరిస్థితులు మరికొన్నాళ్లు కొనసాగితే ఎలా? దీనిపై కళ్లు తెరిచి ముందు జాగ్రత్తలు తీసుకుంటుందా? సగం మంది ఉద్యోగులు ఇళ్లలో ఉండాలని చెప్తూ ఎన్నికల పాట పాడితే ఎలా? ఇదేనా ఏపీ సర్కారు ఇదేనా ముందు చూపు..? ఇప్పటికైనా ఎన్నికల వాయిదాపై అడ్డగోలు విమర్శలు ఆపుతారా? విపక్షాల నుంచి ఇప్పుడిలా ఎన్నో ప్రశ్నలు YCPకి ఎదురవుతున్నాయి. వీటికి జగన్ సహా మంత్రులు ఏం సమాధానం చెప్తారో మరి.

Tags

Read MoreRead Less
Next Story