గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనతా కర్ఫ్యూ ప్రభావం..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనతా కర్ఫ్యూ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో జనమంతా ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిన్న రాత్రి మూతపడ్డ షాప్‌లు,హోటళ్లు, మాల్స్ మళ్లీ రేపు ఉదయం వరకూ తెరిచే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా 14 గంటల బంద్‌కి పిలుపు ఇచ్చినా తెలంగాణవ్యాప్తంగా 24 గంటల బంద్ పాటిస్తుండడంతో కరోనాపై సమరంలో మేముసైతం అంటున్నారు హైదరాబాదీలు.
అర్థరాత్రి నుంచి సిటీ బస్ సర్వీసులు నిలిపేయడమే కాకుండా బయటి ప్రాంతాల నుంచి కూడా ట్రావెల్స్ సహా ఇతర బస్సులు ఆపేశారు. తెలంగాణ సరిహద్దులు మూసేశారు. నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాహనాలు తప్ప మిగతావన్నీ రేపటి వరకూ నిలిచిపోవాల్సిందే. ఐతే.. ఈ కర్ఫ్యూకి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com