భారత్ లో 6కు చేరిన కరోనావైరస్ మృతుల సంఖ్య

భారత్ లో 6కు చేరిన కరోనావైరస్ మృతుల సంఖ్య

ఓ పక్క దేశమంతా జనతా కర్ఫ్యూ కొనసాగుతున్న సమయంలో ఇవాళ 2 మరణాలు సంభవించడం కలకలం రేపుతోంది. తాజాగా మహారాష్ట్ర, బీహార్‌లో ఒకొకరు ఈ కోవిడ్‌-19 వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. మృతుల సంఖ్య 6కి పెరిగింది. పాజిటివ్ కేసులు 326కి చేరాయి. మహారాష్ట్రలో ఇప్పటికే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, తాజాగా మరో వ్యక్తి మరణించడంతో హైఎలర్ట్ ప్రకటించారు. బైలోని HN రిలయన్స్ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి ఇవాళ చనిపోయినట్టు BMC ప్రకటించింది. డయాబెటిస్‌, BP పేషెంట్ కావడం వయసు కూడా 63 ఏళ్లు కావడంతో కరోనా ఎఫెక్ట్ నుంచి కోలుకోలేక అతను చనిపోయినట్టు చెప్పారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 10 మందికి కొత్తగా పాజిటివ్ అని తేలడంతో జనం కూడా బయటకు రావాలంటనే వణికిపోతున్నారు. అటు, బీహార్‌లోని పాట్నా ఎయిమ్స్‌లో తొలి కరోనా మరణం నమోదుతో అక్కడ కూడా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నిజానికి బీహార్‌లో నమోదైన కేసుల సంఖ్య తక్కువే. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో చికిత్స మొదలు పెట్టినా పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు.

అటు, కరోనా ప్రకంపనలతో పంజాబ్‌ పూర్తిగా షట్‌డౌన్ ప్రకటించినట్టు తెలుస్తోంది. అటు కర్నాటక కూడా సరిహద్దులను తిరిగి ఎప్పుడు తెరవాలనే దానిపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామంటోంది. అటు, దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో జనతా కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రజల స్ఫూర్తిని ప్రశంసిస్తూ మోదీ ట్వీట్‌ చేశారు. కరోనాపై పోరాటంలో దేశమంతా ఒకే మాటపై ఉందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story