హైదరాబాద్ మార్కెట్లలో మండిపోతున్న కూరగాయల ధరలు

కరోనాను ఎదుర్కొనేందుకు కర్ఫ్యూ వాతావరణాన్ని జనం స్వాగతిస్తున్నా నిత్యావసరాల కోసం రోడెక్కక తప్పలేదంటున్నారు. ప్రజారవాణా పూర్తిగా స్తంభించడంతో ఒక్కసారిగా పెరిగిన రేట్లు గుబేల్ మనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇబ్బందుల్లేకుండా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో.. హెల్త్ పరంగా అందరిలో అవగాహన పెంచే కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలంటున్నారు.
హైదరాబాద్ మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇటు సర్కార్ లాక్‌డౌన్ అనడంతో.. అటు వ్యాపారులు రేట్స్ డబుల్ అన్నారు. కేజీ మిర్చీ ఏకంగా 160 రూపాయలకు పెంచేశారు. నిన్నటి వరకు 10 రూపాయలున్న కిలో టమాటా.. ఇప్పుడు 50 రూపాయలు పలుకుతోంది. బెండకాయ.. దొండకాయ.. ఏదైనా కేజీ 80 రూపాయలయ్యింది. అటు.. ఆకుకూరల రేట్లు సైతం డబుల్ అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com