తాజా వార్తలు

కరీంనగర్‌ జిల్లాలో తొలి కరోనా కేసు

కరీంనగర్‌ జిల్లాలో తొలి కరోనా కేసు
X

కరీంనగర్‌ జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇటీవల ఇండోనేషియా నుంచి వచ్చిన మతప్రచారకులతో కలసి సంచరించిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని అధికారులు ప్రకటించారు. మత ప్రచారకులకు కరోనా ఉండడం వల్లే కరీంనగర్ వ్యక్తికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని అధికారులు తెలిపారు. కరోనా బాధితున్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతనికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇండోనేషియా మత ప్రచారకులతో సన్నిహితంగా తిరిగినవారు కూడా కచ్చితంగా కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక సూచించారు. కరీంనగర్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఒకరికొకరు దూరం పాటించాలని చెప్పారు.

Next Story

RELATED STORIES