కరోనాతో విలవిలలాడుతున్న ఇటలీ.. మృతదేహాల పూడ్చివేతకు ముందురాని ప్రజలు

కరోనాతో విలవిలలాడుతున్న ఇటలీ.. మృతదేహాల పూడ్చివేతకు ముందురాని ప్రజలు

కరోనా మహహ్మరి కొట్టిన దెబ్బతో ఇటలీ విలవిల్లాడుతోంది. ఇటలీలో కరోనా మరణ మృదంగం కొనసాగుతునే ఉంది. ఆదివారం ఒక్క రోజే 651 మంది చపోయారు. ఇప్పటి వరకు ఆ దేశంలో వైరస్‌ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 5వేల 500 మంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైన ఇటలీ.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో బిక్కిబిక్కుమంటోంది. ఉత్తర ఇటలీలోనే లంబార్డె ప్రాంతంలోనే అత్యధికంగా కోవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి. సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడంలో కరోనా ఇక్కడ తీవ్రంగా ఉందంటున్నారు వైద్యులు.

ఇటలీలో ప్రజలు పిట్టలల్లా రాలిపోతున్నారు. దీంతో దేశ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన దేశాధ్యక్షుడు సర్గియో మట్టరెల్లా బోరును విలపించారు. ఇటలీ జనాభా కేవలం 6 కోట్లు. ప్రపంచంలోనే అత్యాధునిక వైద్య సదుపాయలు ఉన్న దేశం. అలాంటి దేశ అధ్యక్షుడే ఎవరిని కాపాడలేమంటూ చెత్తులెత్తేసి కన్నీళ్లు పెట్టుకున్నారు. రోజురోజుకు గుట్టలుగా పేరుకుపోతున్న శవాలు, శవాలు పూడ్చేందుకు స్థలాలు లేక అసలు ఆ మృతదేహాలను పూడ్చడానికి ఎవరు రాక ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికీ అక్కడ ప్రజా రవాణా నిలచిపోలేదు. ప్రజలంతా స్వేచ్చగా రోడ్లపై తిరుగుతున్నారు. విందులు, వినోదాలు చేసుకుంటుూ రెస్టారెంట్లలో, హోటళ్లలో గడిపేస్తున్నారు. కనీసం మాస్కులు కూడా ధరించడం లేదు. దీంతో.. ఇటలీలో కోవిడ్‌ వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఇటలీలో పరిస్థితులు రెండు నెలల కిందట వూహాన్‌ మాదిరే ఉన్నాయి. వైరస్‌ తీవ్రత ఎక్కువ కావడంతో.. వూహాన్‌ మొత్తం లాక్‌డౌన్‌ చేశారు. దీంతో కోవిడ్‌ కేసులు క్రమంగా అదుపులోకి వచ్చాయి. కానీ ఇటలీలో మాత్రం అలాంటి చర్యలు తీసుకోలేదు.

మరోవైపు..ఇటలీనీ ఆదుకునేందుకు భారత్‌ పెద్ద మనసు చాటుకుంది. ఆ దేశానికి వైద్య పరికరాలు, మాస్కులు పంపించింది. భారత్‌ చేసిన సాయాన్ని స్వాగతిస్తూ.. కష్టకాలంలో తమకు అండగా ఉన్న భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది ఆ దేశ విదేశాంగ శాఖ.

Tags

Read MoreRead Less
Next Story