కరోనా కట్టడికి లాక్‌డౌన్‌లు చాలవు : డబ్ల్యూహెచ్ ఓవో

కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే.. కేవలం లాక్‌డౌన్‌లు చాలవన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మైక్ ర్యాన్. వైరస్ తిరిగి పుంజుకోకుండా.. ఉండాలంటే ఆయన దేశాలు చేపట్టే ప్రజారోగ్య చర్యలు కీలకమన్నారు. ప్రస్తుతం కరోనా బాధిత దేశాలు.. వైరస్ సోకిన వాళ్లను కనిపెట్టి వాళ్లను ఐసోలేషన్ వార్డుకు తరలించడంపై దృష్టిపెట్టాలన్నారు. లాక్‌డౌన్లు విధించినంత మాత్రాన.. వైరస్‌ను అడ్డుకోలేమన్నారు. తర్వాత సరైన ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టకపోతే.. ఈ లాక్‌డౌన్‌లే మరింత ప్రమాదకరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందనన్నారు.
చైనా, సింగపూర్, దక్షిణ కోరియా వంటి దేశాలు వైరస్ బాధితులను వేగంగా గుర్తించాయన్నారు. ఆ దేశాలను మిగిలిన దేశాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మైక్ ర్యాన్. త్వరలోనే కరోనాకు టీకా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడమే కీలకమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com