తెలంగాణ లాక్‌డౌన్ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం

తెలంగాణ లాక్‌డౌన్ నేపథ్యంలో పరుస్థితిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు అత్యున్నత స్థాయి.. అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక.. తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరలు పాల్గొననున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా
తీసుకుంటున్న చర్యలు.. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితితులపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ భేటీ ముగిసిన తర్వాత.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సీఎం కేసీఆర్ వీడియో కన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. అటు.. సాయంత్రం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com