కరోనా ఎఫెక్ట్ : రాజ్యసభ ఎన్నికలు వాయిదా

X
TV5 Telugu24 March 2020 3:58 PM GMT
కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో పాగా వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ ప్రకటించింది. వైరస్‌పై తదుపరి పరిస్థితిని సమీక్షించిన అనంతరం.. తేదీలను ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. కాగా పది రాష్ట్రాల్లో ఇప్పటికే 37 సీట్లు ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే. మిగిలిన 18 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అందులో ఏపీలో నాలుగు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
Next Story