మణిపూర్‌లో తొలి కరోనా కేసు నమోదు

మణిపూర్‌లో తొలి కరోనా కేసు నమోదు

దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. కేరళ, మహారాష్ట్రల్లో వైరస్ ఎఫెక్ట్ ఎక్కువ గా ఉంది. ఈశాన్య రాష్ట్రాలకు ఈ వైరస్‌ పాకుతోంది. మణిపూర్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. మొత్తంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు 564కి చేశాయి. వైరస్ సోకి 10 మందికి పైగా మృతి చెందారు. మరో 37 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. మరో 446 మంది ప్రత్యేక పరిశీలనలో ఉన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. పంజాబ్, ఢిల్లీ, పుదుచ్చేరీ సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అత్యవసర సేవల సిబ్బందిని మాత్రమే బయటికి అనుమతి ఇస్తున్నారు.

రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 106 కేసులు నమోదయ్యాయి. కేరళలో 95 కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో నలుగురు కోలుకొని ఇంటికి వెళ్లారు. కర్ణాటకలో 37 కేసు లు నమోదు కాగా ఇద్దరు కోలుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 32 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 9 మంది కోలుకున్నారు. రాజస్థాన్‌లో 31 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు బాధితులు కోలుకోవ డంతో వారిని డిశ్చార్చ్ చేశారు. ఢిల్లీలో 30 కేసులు రిజిస్టర్ చేశారు. ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నారు. గుజరాత్ లో 29, హర్యానాలో 26, పంజాబ్‌లో 21, తమిళనాడులో 12 కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో ఒకరు చనిపోగా హర్యానాలో 11 మంది కోలుకున్నారు. మధ్యప్రదేశ్‌లో 8 , బెంగాల్‌లో 7, హిమాచల్ ప్రదేశ్, బిహార్‌లలో రెండేసి కేసులు రిజిస్టర్ చేశారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణాలో 39 కేసులు నమోదయ్యాయి. ఒక బాధితుడు చికిత్స తర్వాత కోలుకోవడంతో అతన్ని డిశ్చార్జ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 7 కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ లాక్‌డౌన్ ప్రకటించారు. జిల్లాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయారు. సరిహద్దులను మూసివేసి అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలిస్తే, లఢాఖ్‌లో 13, ఛండీగడ్‌లో 6, పుదుచ్చేరీ ఒకటి, జమ్మూకశ్మీర్‌లో 4 కేసులు నమోదయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలకూ కరోనా వ్యాపిస్తోంది. మణిపూర్‌లో మొదటి కేసు నమోదు చేశారు. దాంతో ఈశాన్య రాష్ట్రాల్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. సరిహద్దులను మూసివేసి ఇతర దేశాల నుంచి ఎవ్వరినీ అనుమతించడం లేదు.

కరోనాను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. 21రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఆంక్షలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే కర్ఫ్యూ విధించాలని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story