మహారాష్ట్రలో అత్యధికంగా 106 కరోనావైరస్ కేసులు

మహారాష్ట్రలో అత్యధికంగా 106 కరోనావైరస్ కేసులు
X

రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 106 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు విదేశీయులు న్నారు. కేరళలో 95 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 8మంది విదేశీయులు ఉన్నారు. బాధితుల్లో నలుగురు కోలుకొని ఇంటికి వెళ్లారు. కర్ణాటకలో 37 కేసులు నమోదు కాగా ఇద్దరు కోలుకున్నారు. ఒక వ్యక్తి మర ణించాడు. ఉత్తర ప్రదేశ్‌లో 32 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక విదేశీయుడు ఉన్నాడు. బాధితుల్లో 9 మంది కోలుకున్నారు. రాజస్థాన్‌లో 31 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు విదేశీయులున్నారు. ముగ్గురు బాధితులు కోలుకోవడంతో వారిని డిశ్చార్చ్ చేశారు. ఢిల్లీలో 30 కేసులు రిజిస్టర్ చేశారు. ఇందులో ఒక విదేశీయుడు ఉన్నాడు. ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నారు. గుజరాత్ లో 29, హర్యానాలో 26, పంజాబ్‌లో 21, తమిళనాడులో 12 కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో ఒకరు చనిపోగా హర్యానాలో 11 మంది కోలుకున్నారు. మధ్యప్రదేశ్-7, బెంగాల్-7, హిమాచల్ ప్ర దేశ్-3, బిహార్-2, ఒడిశా-2 కేసులు రిజిస్టర్ చేశారు.

Next Story

RELATED STORIES