ఏప్రిల్ 14 వరకు ట్రైన్లు బంద్

ఏప్రిల్ 14 వరకు ట్రైన్లు బంద్
X

కరోనా ఎఫెక్ట్‌తో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మొదట ఈ నెల 31 వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించగా.. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌ డౌన్‌ ప్రకటించింది మోదీ సర్కార్. ఈ లాక్‌డౌన్ నేపథ్యంలో రైలు సర్వీసులన్నిటిని దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 14 వరకు నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా విస్తరణను నిరోధించే క్రమంలో మొదట మార్చి 31 వరకు ఉన్న రైలు సర్వీసుల నిలిపివేతను.. ఏప్రిల్ 14 వరకు పొడిగించింది. గూడ్స్ ట్రైన్లు మినహా అన్ని రైళ్లను రద్దు చేసింది. లాక్ డౌన్ నుంచి మినహాయింపు లభించిన నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా గూడ్సు రైళ్లను యథాతథంగా నడపనుంది. అలాగే స్థానిక రైలు సర్వీసులు కూడా ఏప్రిల్ 14 వరకు నిలిపివేశారు. లోకల్ రైళ్లను నిలిపి వేయడం చరిత్రలో ఇదే మొదటిసారి.

Next Story

RELATED STORIES