అమెరికాలో ఒక్క రోజే 10 వేల కేసులు

X
TV5 Telugu26 March 2020 10:13 AM GMT
అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మంగళవారం ఒక్క రోజే యూఎస్ లో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. ఒక్కరోజే 150 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 930కు చేరింది. తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్ నగరంలో మంగళవారం 53 మంది మృత్యువాతపడ్డారు. దీంతో న్యూయార్క్ లో మృతిచెందిన వారి సంఖ్య 201కి చేరింది. అక్కడ బాధితుల సంఖ్య 25వేలకు పెరిగింది. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిషిగాన్, ఇల్లినాయిన్, ఫ్లోరిడాలోనూ వైరస్ తీవ్రత అధికంగా ఉంది.
Next Story