Top

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఇద్దరు ఎన్నారైలపై కేసు

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఇద్దరు ఎన్నారైలపై కేసు
X

ఏపీలో ఇద్దరు ఎన్ఆర్ఐలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కృష్ణాజిల్లాలోని మైలవరంలో హోమ్ క్వారెంటైన్‌ పాటించని ఇద్దరు ఎన్నారైలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 14న అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు ఎన్నారైలను పోలీసులు హోమ్ క్వారంటైన్‌కు ఆదేశించారు. గ్రామ సంరక్షణ కార్యదర్శి తనిఖీ చేసిన సమయంలో సదరు ఎన్నారైలిద్దరూ ఇంట్లో లేరు. దీంతో ఇద్దరు ఎన్నారైలపై మైలవరం పీఎస్‌లో క్వారెంటైన్ యాక్ట్ ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేశారు.

Next Story

RELATED STORIES