పెద్దన్నయ్య పెద్ద మనస్సు : పవన్ కళ్యాణ్

పెద్దన్నయ్య పెద్ద మనస్సు : పవన్ కళ్యాణ్

covid-19 ను ఎదుర్కొనేందుకు టాలీవుడ్ సినీ పరిశ్రమ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పరిశ్రమకు ఎటువంటి కష్టం వచ్చినా తక్షణమే స్పందించే నా పెద్ద అన్నయ్య చిరంజీవి గారు సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించినందుకు ఆయన తమ్ముడిగా గర్వపడుతున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమా పరిశ్రమలోని 24 విభాగాలలోని ప్రతీ టెక్నీషియన్‌, ప్రతీ కార్సికుని శ్రమ తెలిసిన వక్తి చిరంజీవి గారు. కరీనా దెబ్బతో ఉపాధి శేత్రయి సినిమానే నమ్ముకుని జీవిస్తున్న ఎందర్‌ కార్మికులు, టెక్నీషియన్లు ఆర్థికంగా అల్లాడిపోతున్నారు. అటువంటి వారిని ఆదుకేడానికి పెద్దన్నగా ముందుకు వచ్చిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని అన్నారు..

అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్న ఆయన దయార్ద్ర హృదయానికి జేజేలు పలుకుతున్నాను. అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇక నాలుగు కీట రూపాయల భూరి విరాళాన్ని ప్రకటించి ప్రభాస్‌ తన పెద్ద మనస్సును చాటుకున్నారని అన్నారు. సమాజ క్షేమం గురించి ఆలోచించే మహేష్‌ బాబు కోటి రూపాయలు ఇచ్చి సమాజం పట్ల తనకున్న ఆపేక్షను వ్యక్తం చేసారు. నా అన్న బిడ్డ రాంచరణ్‌... తండ్రి అడుగుజాడలలోనే పయనిస్తూ తనకంటూ ఒక సేవాభావాన్ని పెంపొందించుకుంటున్న రాంచరణ్‌ 75 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చి యువతకు స్పూర్తిగా నిలిచాడు. మరో యువ శక్తి తారక్‌ ( జూనియర్‌ ఎన్‌.టి.ఆర్‌.) 70 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించడం ముదావహం అన్నారు.

అలాగే తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి విపత్తు వచ్చినా స్పందించే అల్లు అర్జున్‌ కోటి 25 లక్షల రూపాయలను విరాళంగా అందించి ప్రజల పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. సినిమా కుటుంబం నుంచి తొలి విరాళంగా 20 లక్షల రూపాయలను ఇచ్చిన నితిన్‌ ను మెచ్చుకుని తీరవలసిందే. సినిమా హీరీగా నిలదిక్కుకుంటున్న సాయి ధర్మ తేజ్‌ 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించి తన బాధ్యతను చాటుకున్నాడు అని పవన్ కళ్యాణ్ అన్నారు. మృదు స్వభావి, సృజనాత్మక దర్శకుడు త్రివిక్రమ్‌ 20 లక్షలు, సామాజిక స్పృహతో సినిమాలు తీసే కొరటాల శివ, అనిల్‌ రావిపూడి 10 లక్షల రూపాయల చొప్పున, అగ్ర నిర్మాతలలో ఒకరైన శ్రీ దిల్‌ రాజు 20 లక్షల రూపాయలు, సంగీత దర్శకుడు తమన్‌ 5 లక్షలు ప్రకటించినందుకు వారికి మనస్సూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు.

అదే విధంగా సీనియర్‌ నటులు శ్రీ ప్రకాష్‌ రాజ్‌ తన వద్ద పని చేస్తున్న ఉద్యోగులకు ముందుగానే జీతాలు ఇచ్చి, సినీ కార్మికుల కోసం కొంత మొత్తాన్ని కేటాయించడంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పదకొండు మందికి ఆశ్రయం ఇవ్వడం ఆయనలోని పెద్ద మనస్సుకు నిదర్శనం. అదే విధంగా తన చిత్తానికి పని చేస్తున్న 50 మంది సాంకేతిక నిపుణులు, కార్మికులకు 10 వేల రూపాయల చొప్పున తన నిర్మాత సతీష్‌ వేగేశ్నతో కలసి ఇచ్చిన అల్లరి నరేష్‌, సినీ కార్మికుల కోసం ఐదు లక్షలు రూపాయలు అందించిన దర్శకుడు వి.వి.వినాయక్‌ లను అభినందిస్తున్నాను. హీరో రాజశేఖర్‌, నటులు శ్రీ శివాజీ రాజా సినిమా కార్మికులకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించడానికి ముందుకు వచ్చినందుకు అభినందనలు. అంటూ ఇలా కరోనాను కట్టడిచేయడం కోసం ముందుకు వచ్చిన దాతలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story