రాష్ట్రంలో 59 మందికి కరోనా.. ఈ ఒక్కరోజే 10 కేసులు : సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో 59 మందికి కరోనా.. ఈ ఒక్కరోజే 10 కేసులు : సీఎం కేసీఆర్‌

కరోనా వైరస్ ప్రభావంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మాట్లాడారు.. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసులను వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 59 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఈ రోజు ఒక్క రోజే 10 పాజిటివ్‌ కేసులు వచ్చాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే ఇందులో ఒకరు కోలుకున్నారని.. వారు డిశ్చార్జి కూడా అయినట్టు తెలిపారు.. మిగిలిన 58 మంది వైద్య చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

అలాగే మరో 20వేల మంది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నట్టు వెల్లడించిన ముఖ్యమంత్రి వీళ్ల గురించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కు ప్రజలు సహకరిస్తున్నారని.. ఈ విషయంలో ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. లాక్ డౌన్ అమలు చేయకపోతే పరిస్థితి ఇంకా భయంకరంగా ఉండేది అని సీఎం చెప్పారు.

ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనాకు మందు కనిపెట్టలేదని పేర్కొన్న ముఖ్యమంత్రి దీని వ్యాప్తిని నిరోధించడమే పెద్ద విరుగుడన్నారు.. అంతేకాదు స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అని చెప్పారు. అందువల్ల ప్రజలెవ్వరూ ఇళ్లలోంచి బయటికి రాకుండా ఉండాలి.. ఏమౌతుందిలే అనే నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని కేసీఆర్‌ హితవు పలికారు. ఉదయం ప్రధాని మోదీతో మాట్లాడానని చెప్పిన కేసీఆర్ రాష్ట్రంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఐసోలేషన్‌ వార్డుల్లో 11వేల మందికి చికిత్స అందే ఏర్పాట్లు చేశాము. 1400 ఐసీయూ బెడ్స్‌ సిద్ధం చేస్తున్నాము. 60వేల మందికి వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశాం. రిటైర్‌ అయిన వైద్యులు, మెడికల్‌ సిబ్బందిని వినియోగించుకుంటామని సీఎం చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story