దాచేపల్లి చెక్‌పోస్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు

దాచేపల్లి చెక్‌పోస్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు చెక్‌పోస్ట్‌ దగ్గర పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏపీలోకి తమను అనుమతించాలని గుంటూరు జిల్లా దాచేపల్లి చెక్‌పోస్టు దగ్గర రెండు రోజులుగా బోర్డర్‌ దగ్గర పడిగాపులు కాస్తున్న వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం ఏపీ నుంచి హైదరాబాద్‌ వచ్చి ఇక్కడ హాస్టల్స్‌లో ఉంటున్నవారిని.. ఖాళీ చేయించడంతో వారంతా తమ సొంతూళ్లకు బయలుదేరడానికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు తీసకున్నారు. ఆ సర్టిఫికెట్లు ఉంటే ఏపీలోకి అనుమతిస్తారనే ఆశతో.. అలాగే అత్యవసర పనులు ఉన్నాయంటూ మరికొందరు ఏపీకి బయలు దేరారు. వారందరికీ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఉండడంతో తెలంగాణను దాటుకుంటూ ఏపీ బోర్డర్‌ వరకు చేరుకోగలిగారు. కానీ అక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోర్డర్‌ దాటేందుకు వీలు లేదంటూ పోలీసులు బోర్డర్‌ను మూసేశారు. అక్కడికి చేరుకున్నవారంతా కాళ్లావేలా పడినా వినలేదు.. అనుమతి లేదంటూ అక్కడే ఆపేసేరు. దీంతో తినేందుకు తింటి, తాగేందుకు నీళ్లు లేక పిల్లలు, వృద్ధులతో నానా ఇబ్బందులు పడ్డారు.

బుధవారం బోర్డర్‌కు చేరుకున్నా.. ఎప్పటికైనా అనుమతిస్తారని వేచి చూస్తూ వచ్చారు. అయినా పోలీసులు అనుమతించకపోవడంతో మరోసారి అంతా వెళ్లి పోలీసులను రిక్వస్ట్‌ చేశాడు. అయినా పోలీసులు నో అనడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. పోలీసుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో పోలీసులు చేతిలో లాఠీలకు పని చెప్పారు. చిన్నపిల్లు ఉన్నారని కనికరం చూపించకుండా రెచ్చిపోయారు. దీంతో కొందరు యువకులు రాళ్ల దాడికి దిరారు. దీంతో దాచేపల్లి మండలం పొందుగుల గ్రామంలోని తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story