కరోనాకు బలైన మరో పిన్న వయస్కురాలు

X
TV5 Telugu27 March 2020 10:52 PM GMT
ఇటలీలో కరోనా వైరస్ బారిన పడి అత్యంత పిన్న వయస్కురాలు మృతి చెందారు. బాలిక వయసు 16 ఏళ్ళు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా అతి చిన్న వయస్కురాలు మృతి చెందటం ఆ దేశంలో ఇదే ప్రథమం. పారిస్‌కు చెందిన జూలీకి గత వారం కరోనా వైరస్ సోకింది. దాంతో దగ్గు , జ్వరం వంటి లక్షణాలు మొదలయ్యాయి. కొద్దిరోజుల తర్వాత దగ్గుతో పాటు విపరీతమైన కఫం రావడంతో కుటుంబసభ్యులు సదరు బాలికను ఆసుపత్రికి తరలించారు.
ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా వైరస్ సోకి ఊపిరితిత్తులు బాగా పాడైపోయినట్టు గుర్తించారు. ఆమెను కొద్దీ రోజులు ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్స అందించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ బాలిక చికిత్స పొందుతూ మరణించింది. కాగా, కొద్దిరోజుల క్రితం పనామాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణ అమెరికాలో కూడా ఓ బాలిక మృతి చెందింది.
Next Story