క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. క్రెడిట్ కార్డు బిల్లు కట్టనవసరం లేదు

క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. క్రెడిట్ కార్డు బిల్లు కట్టనవసరం లేదు

కరోనావైరస్‌పై పోరాటంలో సామాన్యులతో ఆర్బీఐ చేతులు కలిపింది. రెపో రేటు, రివర్స్ రెపో రేటుతో పాటు.. CRR, MSFలను కూడా తగ్గిస్తూ.. ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. గృహ రుణాలతో సహా అన్ని రకాల లోన్‌లపై 3 నెలల మారటోరియం విధించింది. సహకార రుణాలపై కూడా మారటోరియంను అమలు చేసింది. ఆర్‌బీఐ నిర్ణయంతో ఇప్పుడు కట్టాల్సిన రుణాలను గడువు తర్వాత ఎప్పుడైనా చెల్లించవచ్చు. రాబోయే 3 నెలలు ఈఎంఐలు చెల్లించకపోయినా పర్వాలేదని ఆర్బీఐ తెలిపింది. ఎన్‌పీఏలుగా పరిగణించరాదని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనివల్ల రుణగ్రహీతల క్రెడిట్‌ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం పడదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలియజేశారు.

అయితే క్రెడిట్ కార్డు బకాయిలపై మాత్రం ఆందోళన నెలకొంది. దీంతో ఇప్పుడు ఆర్‌బీఐ క్రెడిట్ కార్డు బకాయిలపై కూడా స్పష్టతనిచ్చింది. వీటికి కూడా ఈఎంఐ మారటోరియం రూల్స్ వర్తిస్తాయని తెలిపింది. నెలవారీ ఈఎంఐలతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలు కూడా మారటోరియం కిందకు వస్తాయని స్పష్టం చేసింది. దీంతో క్రెడిట్ కార్డుదారులకు ప్రయోజనం కలుగనుంది.

Tags

Read MoreRead Less
Next Story