Top

కేరళలో 164 కు చేరిన కరోనా కేసులు

కేరళలో 164 కు చేరిన కరోనా కేసులు
X

కేరళలో శుక్రవారం కొత్తగా 39 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని, చికిత్స పొందుతున్న మొత్తం వ్యక్తుల సంఖ్య 164 కు చేరుకుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. 39 కేసులలో 34 కేసులు ఉత్తరాన ఉన్న కాసరాగోడ్ జిల్లాకు చెందినవని ఆయన అన్నారు. తిరువనంతపురంలో జరిగిన కోవిడ్ -19 సమీక్షా సమావేశం అనంతరం విలేకరులతో ఈ విషయాన్నీ వెల్లడించారు.

అలాగే కొత్తగా కన్నూర్ నుంచి రెండు కేసులు నమోదయ్యాయని, త్రిస్సూర్, కోజికోడ్, కొల్లం నుంచి ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,10,299 మంది నిఘాలో ఉన్నారని, 616 మంది వివిధ ఆసుపత్రుల ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Next Story

RELATED STORIES