UK ప్రధాన మంత్రికి కరోనా వైరస్ పాజిటివ్

UK ప్రధాన మంత్రికి కరోనా వైరస్ పాజిటివ్

యుకె ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా వైరస్ సోకింది. కరోనావైరస్ కోసం తనకు పాజిటివ్ పరీక్షలు చేశారని శుక్రవారం స్వయంగా జాన్సన్ వెల్లడించారు, ఈ వ్యాధి బారిన పడిన ప్రపంచ మొదటి ప్రధాన మంత్రిగా ఆయన నిలిచారు.

55 ఏళ్ల జాన్సన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తనకు “ హై టెంపరేచర్ మరియు నిరంతర దగ్గు” ఉన్నాయని.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఒంటరిగా ఉన్నానని.. అయినా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఆయన అన్నారు. సాక్షాత్తు ప్రధానికి కరోనా సోకడంతో యూకే ప్రజలు మరింత ఆందోళనలో ఉన్నారు. ఇదిలావుంటే ఇక జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 533,000 కేసులు నిర్ధారించబడ్డాయి, వీటిలో 24,082 మరణాలు కూడా ఉన్నాయి,

Tags

Read MoreRead Less
Next Story