డాక్టర్స్‌కి వందనం.. అన్నం, నీళ్లు లేవు.. డ్యూటీలోనే 12 గంటలు..

డాక్టర్స్‌కి వందనం.. అన్నం, నీళ్లు లేవు.. డ్యూటీలోనే 12 గంటలు..

వర్షం వచ్చిన వరదలొచ్చినా, ఆఖరికి వైరస్ వచ్చినా వర్క్ ఫ్రం హోం అందరికీ సాధ్యం కాదు.. ప్రాణం పోతున్న మనిషికి వైద్యం చేసి ఊపిరి అందించే డాక్టర్ కనిపించే దేవుడంటారు బాధ భరించే వారు. నిజమే.. కరోనా వైరస్ విజృంభించకుండా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా డాక్టర్ మరింత ఎక్కువగా కష్టపడి పని చేయాల్సిన సమయం. ప్రాణాలను, తమ ఆరోగ్యాన్నీ ఫణంగా పెట్టి రోగులను బతికిస్తున్నారు. మరికొంత మందికి ఈ వైరస్ సోకకుండా చూస్తున్నారు.

కానీ వాళ్లు మనుషులే, వాళ్లకీ ఆకలి దప్పులు ఉంటాయి. అయినా రోజుకి 12 గంటలు డ్యూటీ చేస్తూ రోగులకు నిర్విరామంగా సేవలు అందిస్తున్నారు. వాళ్లు కూడా తినడానికి సరైన తిండి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. మహా నగరం ముంబయిలోనే రెండో అతి పెద్ద హాస్పిటల‌్‌గా పేరొందిన కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (KEM)హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు ఆహారం సరిగా అందడం లేదు. దీంతో బిస్కెట్లు తిని, నీళ్లు తాగి కడుపు నింపుకుంటున్నారు. కొన్ని హాస్పిటల్స్‌కు తాజ్ హోటల్స్ నుంచి పార్సిళ్లు అందుతున్నా అవి అందరికి సరిపోవడం లేదంటూ వైద్యులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

శ్రీదేవి తాంక్సాలే అనే యూజర్ థాకరేకు ట్వీట్ చేస్తూ తాము పడుతున్న ఇబ్బందిని వ్యక్తం చేసింది. కనీసం బయట నుంచి టిఫిన్ తెప్పించుకుందామన్న అది కూడా లభ్యం కావడం లేదని వెల్లడించింది. రేయింబవళ్ళు డ్యూటీ చేసి సరైన ఆహారం అందక వైద్యులు నీరసించి పేషంట్లయితే పరిస్థితి దారుణంగా ఉంటుందని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా పలువురు వైద్యులు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story