Top

రూ.25 కోట్లు ఇచ్చేముందు నాతో ఓమాట..

రూ.25 కోట్లు ఇచ్చేముందు నాతో ఓమాట..
X

డబ్బులు ఉన్నా ఆపదలో ఆదుకునే మంచి మనసు కూడా ఉండాలి. కరోనా బాధితుల సహాయార్థం పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించిన నేపథ్యంలో బాలీవుడ్ హీరో అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నాతో అన్న మాటలు ఇవి. " నా భర్త అంత మొత్తాన్ని ఇచ్చే ముందు ఓసారి ఆలోచించుకోమని అన్నాను. అంత ఇస్తే మనకీ అవసరం కదా అన్నాను. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అది అభిమానుల చలవే. అలాంటి వారికి ఎంత చేసినా తక్కువే. ఇలాంటి పరిస్థితులలో సహాయం చేయకుండా ఎలా ఉండగలను అని అన్నారు. దానికి తానెంతో గర్వంగా ఫీలయ్యానని చెప్పారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తాన్ని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ ఇవ్వలేదు. ప్రస్తుతం అక్షయ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Next Story

RELATED STORIES