అమెరికాలో అరుదైన ఘటన.. COVID-19 కారణంగా శిశువు మృతి

X
TV5 Telugu29 March 2020 11:59 AM GMT
అమెరికాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. COVID-19 కారణంగా శిశువు మరణించింది, చికాగోలో రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై శనివారం అధికారులు మాట్లాడుతూ.. ప్రపంచ మహమ్మారిలో బాల్య మరణానికి కారణమైందని.. ఇది అరుదైన కేసుగా గుర్తించారు.
ఒక వార్తా సమావేశంలో, ఇల్లినాయిస్ గవర్నర్ జెబి ప్రిట్జ్కర్ మాట్లాడుతూ.. గడిచిన 24 గంటలలో కరోనావైరస్ కు సంబంధించిన మరణాలలో "ఒక శిశువు" కూడా ఉందని చెప్పారు.
చికాగోలో మరణించిన పిల్లవాడు ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు గలవాడు.. ఆ పిల్లవాడికి COVID-19 కు పాజిటివ్ అని తేలిందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ తెలిపింది. ఇంతకు మునుపు ఎన్నడూ COVID-19 కారణంగా శిశివు మృతి చెందిన దాఖలాలు లేవని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ న్గోజీ ఎజైక్ ఒక ప్రకటనలో తెలిపారు. మరణానికి కారణాన్ని గుర్తించడానికి పూర్తి దర్యాప్తు జరుగుతోంది. అని తెలిపారు.
Next Story